కొలంబో : శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే.. మోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం శ్రీలంక మిత్ర విభూషణను అందజేశారు. ప్రధాని మోడీ ఈ అవార్డు పొందేందుకు అన్నివిధాలా అర్హులని ఆయన పేర్కొన్నారు.