ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం..

ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున జరిగిన ఈ మహోత్సవంలో స్వామివారిని అద్భుతంగా అలంకరించిన రథం పై గుట్ట చుట్టూ ఊరేగించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై “గోవిందా… గోవిందా…” అంటూ రథాన్ని లాగారు. దివిటీలు కాల్చుతూ, భక్తి జ్వాలలతో నిండిన వాతావరణంలో గిరి ప్రదక్షణ ఆధ్యాత్మిక కాంతిని ప్రసరించింది. మహిళలు, యువత, వృద్ధులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. మహిళలు కోలాటంతో గిరిప్రదక్షణలో పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తూ నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ రథోత్సవం గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపడంతో పాటు భక్తులకు మరపురాని అనుభూతిని అందించింది.

Leave a Reply