ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా ఈరోజు ఉప్పల్ స్టేడియం స్టేడియం హోరెత్తింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయాన్ని అందుకుంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ పంజాబ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి.. టోర్నీలో కంబ్యాక్ ఇచ్చింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో అఖరి స్థానంలో ఉన్న హైదరాబాద్.. 8వ స్థానానికి చేరుకుంది.
పంజాబ్ కింగ్స్ నిర్ధేశించిన 246 పరుగుల ఛేదనలో సన్ రైజర్స్ ఓపెనింగ్ ద్వయం.. ఊర మాస్ ఇన్నింగ్స్ తో అదరగొట్టింది. ట్రావిస్ హెడ్ – అభిషేక్ శర్మ కలిసి పంజాబ్ బౌలర్లను ఉతికారేశారు.
ట్రావిస్ హెడ్ (37 బంతుల్లో 66) అర్ధశతకంతో చెలరేగగా… మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సులతో 141) సెంచరీతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యం ఏర్పాటు చేశారు.
ఇక ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్ (14 బంతుల్లో 21), ఇషాన్ కిషన్ (9) నాటౌట్ లు గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, చాహల్ ఒక్కో వికెట్ తీశారు.
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. 245 పరుగులు సాధించింది. టాపార్డర్ బ్యాటర్లు, ప్రియాంష్ ఆర్య (13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 36), ప్రభమన్ సింగ్ (23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సుతో 42) దంచికొట్టాగా.. శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సులతో 82) కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.
మిడిల్ ఆర్డర్‌లో శశాంక్ సింగ్ (2), గ్లెన్ మాక్స్‌వెల్ (3) విఫలమైనప్పటికీ.. ఆఖర్లో మార్కస్ స్టోయినిస్ (11 బంతుల్లో 34) విధ్యంసం సృష్టించాదు.
హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు తీసి పంజాబ్ జట్టు దూకుడును కొంతవరకు అదుపు చేశాడు. ఇషాన్ మలింగ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.. దీంతో 246 పరుగుల భారీ టార్గెట్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఛేజింగ్ కు దిగనుంది.