srh vs pbks| హైదరాబాద్ బ్యాటింగ్ ఫస్ట్

srh vs pbks| హైదరాబాద్ బ్యాటింగ్ ఫస్ట్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఢీకొంటున్నాయి. న్యూ చంఢీగఢ్లోని ముల్లాన్‌పుర్ స్టేడియం లో మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్ కింగ్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ జట్టు పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఈ జట్టు ఆడిన మూడింట్లో రెండు ఓడి.. ఒకటి గెలిచింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ జట్టు ఈ మ్యాచులో రెండు మార్పులతో బరిలోకి దిగింది. లివింగ్‌స్టోన్ స్థానంలో సలీల్, జయదేవ్ ఉనద్కత్ స్థానంలో ప్రఫుల్ హింజ్ తుది జట్టులోకి తీసుకుంది. పంజాబ్ జట్టు ఎలాంటి మార్పులు చేయకుండా బరిలో దిగింది.

హైదరాబాద్ జట్టు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ బరిలో దిగారు… అభిషేక్ శర్మ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఫోర్లు , సిక్సర్లతో దంచికొడుతున్నాడు. హైదరాబాద్ జట్టు మూడు ఓవర్లకే 44 పరుగులు చేసింది.
ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఇదే..
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కెప్టెన్, వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ
ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: జయదేవ్ ఉనద్కత్, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి, ఫ్రఫుల్, కమిందు మెండిస్
పంజాబ్ కింగ్స్ తుది జట్టు ఇదే..
ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కానోలీ, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, బార్ట్లెట్, విజయకుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: నేహాల్ వధేరా, విష్ణు వినోద్, సూర్యాంశ్, యశ్ ఠాకూర్, హర్పీత్ బ్రార్
