సొంత మైదానంలో పంజాబ్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు విధ్యంసం సృష్టిస్తున్నారు. ఓపెనర్ గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ (40 11 ఫోర్లు, 6 సిక్సులతో 100 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. మరోఓపెనర్ ట్రావిస్ హెడ్ (37 బంతుల్లో 66) తో కలిసి.. తొలి వికెట్ కు 75 బంతుల్లో 171 పరుగుల భాగస్వామ్య అందించాడు.
ఐపీఎల్‌లో SRH తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం:
ఆర్సీబీ పై బెయిర్‌స్టో & వార్నర్ – 185 – హైదరాబాద్, 2019
పంజాబ్ పై హెడ్ & అభిషేక్ – 171 – హైదరాబాద్, 2025, ఈరోజు*
లక్నో పై హెడ్ & అభిషేక్ – 167 – హైదరాబాద్, 2024
IPLలో SRH తరఫున అత్యంత వేగవంతమైన 100లు:
ఆర్సీబీపై ట్రావిస్ హెడ్ – 39 బంతుల్లో 100 – బెంగళూరు, 2024
పంజాబ్ పై అభిషేక్ శర్మ 40 బంతుల్లో 100 – హైదరాబాద్, 2025, ఈరోజు*
కోల్కతా పై డేవిడ్ వార్నర్ 43 బంతుల్లో 100 హైదరాబాద్, 2017
ఆర్ఆర్ పై ఇషాన్ కిషన్ 45 బంతుల్లో 100 హైదరాబాద్, 2025
ఆర్పీబీపై హెన్రిచ్ క్లాసెన్ 49 బంతుల్లో 100 బెంగళూరు, 2023