ఈరోజు ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఈజీ విక్టీర సాధించింది. మొదట బౌలింగ్ లో హైదరాబాద్ ను చిత్తు చేసిన ముంబై, ఆ తర్వాత బ్యాటింగ్ లో ఆధిపత్యం చెలాయించింది. దీంతో ఎస్ఆర్‌హెచ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి దూసుకొచ్చింది.
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై… ఈ సీజన్‌లో మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడి ట్రాక్ తప్పినట్టు కనిపించింది. అయితే, 6వ మ్యాచ్ నుంచి పుంజుకున్న ముంబై… వరుసగా నాలుగు విజయాలతో ప్లే-ఆఫ్ రేసులోకి తిరిగి వచ్చింది. మరోవైపు 8 మ్యాచ్‌ల్లో 6 ఓటములతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 9వ స్థానంలో నిలిచింది.
ఇక ఈ మ్యాచ్ లో 144 పరుగుల ఛేదనలో ముంబై రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. జయదేవ్ ఉనద్కట్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్ తీసుకొని ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (11)ను వెనక్కి పంపాడు.
అయితే, ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ 46 బంతుల్లో 70 పరుగులు చేసి బౌలర్లను దెబ్బతీసాడు. రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయినా.. బ్యాటింగ్ యూనిట్ పై ఒత్తిడి పెరగనివ్వకుండా విల్ జాక్స్ (19 బంతుల్లో 22) తో కలిసి 2వ వికెట్ కు 64 పరుగులు జోడించాడు హిట్ మ్యాన్ రోహిత్. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40*) తో కలిసి 3వ వికెట్ కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 15.4 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించేసింది.
అంతకముందు టాస్ ఓడిన సన్‌రైజర్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే, పరుగుల ప్రలయం సృష్టించాలనుకున్న ఎస్‌ఆర్‌హెచ్ ముంబై బౌలర్ల దెబ్బకు చేతులెసింది. హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 71), అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43) 6వ వికెట్‌కు 99 పరుగులు జోడించడంతో.. 143/8 పరుగలు సాధించింది హైదరాబాద్.
ఇక ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లతో విజృంభించాడు. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీయగా.. బుమ్రా, హార్దిక్ పాండ్య తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.