ఉప్పల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫేవరెట్ హైదరాబాద్ గా బరిలోకి దిగింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ దూకుడును లక్నో జట్టు అదుపు చేయగలిగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఎల్‌ఎస్‌జీ.. హైదరాబాద్ జట్టును 200 దాటకుండా కట్టడి చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టి ఆరెంజ్ ఆర్మీకి.. తొలి ఓవర్లలోనే షాక్ తగిలింది. విధ్యంసకర బ్యాటర్లు అభిషేక్ శర్మ (6), ఇషాన్ కిషన్ (0) 3వ ఓవర్లోనే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో నితిష్ కుమార్ తో జతకట్టిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ 4వ వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యం ఏర్పాటు చేశాడు.
బౌండరీలతో చెలరేగిన హెడ్.. 47 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ ను (26) పరుగులకే ఔట్ చేసింది లక్నో. ఇక నితిష్ కుమార్ రెడ్డి (32) రాణించగా… అనికేత్ వర్మ (36), కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (18) సిక్సుల వర్షం కురిపించారు.
ఎల్‌ఎస్‌జి బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లతో అదరగొట్టారు. అవేష్ ఖాన్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు.
ఇక మొత్తం మీద ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దీంతో లక్నో జట్టు 191 పరుగుల విజయలక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించనుంది.