SRH vs GT | మార‌ని సన్‌రైజర్స్ తీరు.. 10 ఓవ‌ర్ల‌కు స్కోర్ ఎంతంటే !

ఐపీఎల్ 2025 లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ – గుజరాత్ టైటాన్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన సన్రైజర్స్ బ్యాటింగ్ దిగింది. అయితే, ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిన సన్ రైజర్స్ ఈసారి తిరిగి ఫామ్ లోకి వస్తుందని అనుకుంటే… అది పూర్తిగా తలక్రిందులుఅయ్యింది.

సన్‌రైజర్స్ కేవలం 7.2 ఓవర్లలోనే 50 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ 18, ట్రావిస్ హెడ్ 8, ఇషాన్ కిషన్ 17 పరుగులు చేసి నిరాశ‌ప‌రిచారు.

దీంతో 10 ఓవర్లకు కష్టపడి 64 పరుగులు సాధించింది హైదరాబాద్ జట్టు. ప్రస్తుతం క్రీజులో నితిష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ ఉన్నారు.

Leave a Reply