ఐపీఎల్ 2025 లో భాగంగా నేడు హోం గ్రౌండ్ ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడిన హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. అయితే, బ్యాటింగ్ లో అత్యంత బలమైన జట్టుగా భావించే ఎస్‌ఆర్‌హెచ్.. బలమైన స్కోర్ నమోదు చేయడంలో మరోసారి విఫలమైంది. దీంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
హైదరాబాద్ బ్యాటర్లలో నితిష్ కుమార్ రెడ్డి (31), హెర్చిచ్ క్లాసెన్ (27) పరుగులు చేయగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (9 బంతుల్లో 22* నాటౌట్) ఆఖరి ఓవర్లో దంచికొట్టాడు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో మెరిశాడు. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక 153 పరుగుల ఈజీ టార్గెట్ తో గుజరాత్ టైటన్స్ ఛేజింగ్ కు దిగనుంది.