SRH vs GT| నేడు సొంత గడ్డపై సన్ రైజర్స్ కు అగ్ని పరీక్ష

హైదరాబాద్ : సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) మరో సవాల్‌కు సిద్ధమైంది. ఈరోజు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌ను సన్‌రైజర్స్‌ ఢీకొట్టనుంది.ఈ మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం కానుంది.

హ్యాట్రిక్‌ పరాజయాలతో సతమతమవుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌ మళ్లీ గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు హ్యాట్రిక్‌ విజయంపై గుజరాత్‌ కన్నేసింది. వరుసగా రెండు విజయాలు సాధించిన జీటీ.. ఈ మ్యాచ్‌లో ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

.

ఐపీఎల్ 18వ సీజన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్భుతంగా ఆరంభించింది. రాజస్థాన్‌ రాయల్స్‌పై భారీ స్కోరు (286/6) చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. తర్వాతి మూడు మ్యాచ్‌లలో పేలవ ప్రదర్శన చేసింది. లక్నో, ఢిల్లీ, కోల్‌కతా జట్లపై ఓడిపోయింది. కోల్‌కతాపై అయితే 120 పరుగులకే ఆలౌట్ అయింది. ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రధాన బలమైన బ్యాటింగ్‌ విభాగమే.. ఇప్పుడు బలహీనతగా మారడం ఆందోళన కలిగిస్తోంది.

గుజరాత్‌ బౌలింగ్ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో.. ప్రధాన బ్యాటర్లు ట్రావిస్‌ హెడ్, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్, నితీశ్‌ రెడ్డి, హెన్రిస్‌ క్లాసెన్‌లు బ్యాట్లు ఝళిపించకపోతే విజయం కష్టమే. మరోవైపు బౌలింగ్‌ విభాగం కూడా ఏమంత బాలేదు. కమిన్స్, షమీ, హర్షల్‌ పటేల్, సిమర్‌జీత్‌ సింగ్, రాణించడం అత్యంత కీలకం.

ఐపీఎల్ 2025ని ఓటమితో ప్రారంభించిన గుజరాత్‌ టైటాన్స్‌.. వరుసగా రెండు విజయాలతో జోరుమీదుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మంచి ప్రదర్శన చేస్తోంది. సాయి సుదర్శన్, బట్లర్, రూథర్‌ఫర్డ్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. గిల్, షారుక్, తేవాతియా కూడా రాణిస్తే తిరుగుండదు. మహ్మద్‌ సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ, ఇషాంత్‌ శర్మ, అర్షద్‌ ఖాన్, సాయి కిషోర్, రషీద్‌ ఖాన్‌లతో బౌలింగ్‌ కూడా పటిష్టంగా ఉంది.

తుది జట్లు (అంచనా):హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్, కమిందు మెండిస్, సిమర్‌జీత్ సింగ్/జయ్‌దేవ్ ఉనద్కత్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ.గుజరాత్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, ఇషాంత్ శర్మ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *