ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నేడు మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. ఈరోజు జరుగుతున్న 19వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ – గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతుండగా.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హోం గ్రౌండ్ పై ఎస్ఆర్‌హెచ్ మొదట బ్యాటింగ్ చేపట్టనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో విజయంతో సన్‌రైజర్స్ అద్భుతంగా సీజన్ మొదలుపెట్టింది. అయితే, ఆ తరువాత వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటములతో సతమతమవుతోంది. సొంత గడ్డపై విజయం సాధించి ట్రాక్ లోకి రావాలని సన్‌రైజర్స్ టీమ్ భావిస్తోంది.
మరోవైపు, శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ మూడింట, రెండు మ్యాచ్‌లలో నెగ్గింది. విజయోత్సాహంతో ఉన్న గుజరాత్.. సన్ రైజర్స్ మీద నెగ్గి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ సొంతం చేసుకోవాలని గుజరాత్ కన్నేసింది. మరి నేటి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తిరిగి కంబ్యాక్ ఇస్తుందా.. లేదా గుజరాత్ హ్యాట్రిక్ విన్ సాధిస్తుందా అనేది చూడాలి.
తుది జట్లు
గుజరాత్ టైటాన్స్ : శుభమన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ