SRH vs DC | ఢిల్లీతో కీలక పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్ !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మ్యాచ్ లు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్లేఆఫ్స్ కోసం ప్రతి జట్టు చెమటోడ్చుతోంది. ఈ క్రమంలో నేడు మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో.. ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది.

కాగా, ఈ మ్యాచ్ లో హోం గ్రౌండ్ లో టాస్ గెలిచిన స‌న్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టనుంది.

జట్టు మార్పులు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ షమీ, కమిందు మెండిస్‌ల స్థానంలో సచిన్ బేబీ, అభినవ్ మనోహర్, ఎషాన్ మలింగ తుది జట్టులోకి వచ్చారు.

ఢిల్లీ క్యాపిటల్స్: ముఖేష్ కుమార్ స్థానంలో టి నటరాజన్ ప్లేయింగ్ ఎలెవన్ లో కి వచ్చాడు.

తుది జట్లు

ఢిల్లీ క్యాపిటల్స్ : ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, టి.నటరాజన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ.

ఇంపాక్ట్ ప్లేయర్స్:

ఎస్‌ఆర్‌‌హెచ్‌ – ట్రావిస్ హెడ్, వియాన్ ముల్డర్, మహమ్మద్ షమీ, రాహుల్ చాహర్, హర్ష్ దూబే
ఢిల్లీ – అశుతోష్ శర్మ, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, సమీర్ రిజ్వీ, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ

ఆరెంజ్ ఆర్మీకి డూ ఆర్ డై మ్యాచ్ !

ఇదిలా ఉండగా, ఢిల్లీ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 ఓటములతో 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. మరోవైపు సన్‌రైజర్స్ పరిస్థితి బిన్నంగా ఉంది. హైదరాబద్ జట్టు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలు, 7 ఓటములతో 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.

అయితే, ఈ మ్యాచ్‌లో ఓడిపోతే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి ప్లేఆఫ్స్ అవ‌కాశాల‌ను స‌జీవంగా ఉంచుకోవాల‌ని స‌న్‌రైజ‌ర్స్ భావిస్తోంది. మరోవైపు పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉన్న ఢిల్లీ, టాప్ 4లో చోటు దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. దీంతో నేటి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగనుంది.

Leave a Reply