SRAVANI | అవినీతిని నిర్మూలిస్తా..
SRAVANI | వర్ని, ఆంధ్రప్రభ : గ్రామంలో పారదర్శక పాలనకు బాటలు వేస్తానని.. గ్రామపంచాయతీలో పేరుకుపోయిన అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తానని సత్యనారాయణపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిక్కుల శ్రావణి అన్నారు. ప్రభుత్వం మహిళలకు అందజేస్తున్న సమాన అవకాశాలను గ్రామంలో మహిళలు సమర్ధవంతంగా వినియోగించుకునేలా చూస్తాం అన్నారు. అభివృద్ధిలో యువతీ యువకులు భాగస్వామ్య వహించేలా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా ఏర్పాటు చేస్తానని శ్రావణి శ్యామ్ హామీ ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

