ప్రాణాలు విడిచిన చుక్కల దుప్పి
ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : మనుషులకే కాదు జంతువులను కూడా ఊర కుక్కలు(Dogs) వీడడం లేదు. కుక్కలను చూసి అటవీ జంతువులు కూడా హడలెత్తిపోతున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్(Panchikalpattu) మండలంలోని కబరస్థాన్ సమీపంలో ఈ రోజు చుక్కల దుప్పి కుక్కల బారిన పడి ప్రాణాలు వీడింది.
వేటాడిన కుక్కలు..
కబరస్థాన్ సమీపంలో చుక్కల దుప్పి(Spotted Deer) కుక్కల కంట పడింది. దీంతో కుక్కల గుంపు దుప్పిని వేటాడి(Hunting) గాయపరిచాయి. కొన ఊపిరితో ఉన్న దుప్పిని అటవీ సిబ్బంది(Forestry Personne) ప్రాథమిక చికిత్స చేసి వెటర్నరీ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిల్ కుమార్(Forest Staff, Forest Range Officer Anil Kumar) కేసు నమోదు చేసి మృతి చెందిన దుప్పిని అటవీ కార్యాలయం వద్ద దహనం చేశారు.

