SPOT DIED | ద్విచక్ర వాహనం, ఆటో ఢీ
- ప్రమాదంలో మహిళ మృతి
SPOT DIED | కోట, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ కోటమండలం కేశవరం గ్రామపంచాయతీలోని నక్కల డొక్కల వారి కాలనీ వద్ద (జీవీఆర్ రొయ్యల ఫ్యాక్టరీ) రోడ్డు మార్గం(roadway)లో మంగళవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొట్టిన సంఘటనలో గూడలి గ్రామపంచాయతీకి చెందిన లావణ్య అనే మహిళ మృతి చెందింది. కోట ఎస్సై పవన్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


