sportsmen | ప్రతిభ చూపారు.. హాట్స్ ఆఫ్..

sportsmen | ప్రతిభ చూపారు.. హాట్స్ ఆఫ్..
- పవర్ లిఫ్టింగ్ విజేతలకు కలెక్టర్ ప్రశంసలు
sportsmen | గుంటూరు, ఆంధ్రప్రభ : పవర్ లిఫ్టింగ్ క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా పేరును జాతీయ స్థాయికి తీసుకెళ్లిన క్రీడాకారులను గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అభినందించారు. మంగళవారం కలెక్టరేట్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఆమె ప్రత్యేకంగా కలిశారు. హరిద్వార్‌లో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో తుపాకుల నాగజ్యోతి ప్రతిభ చాటింది. అలాగే కర్నూలులో అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో కె. సత్య రామరాజు విజేతగా నిలిచాడు.
కలెక్టర్ వారిని ప్రశంసిస్తూ…క్రీడాకారులు పట్టుదలతో శ్రమించి భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించాలని, జిల్లాకు మరియు రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడాకారుల విజయాలకు వెన్నుదన్నుగా నిలిచిన కోచ్ మరియు తల్లిదండ్రులను కూడా ఆమె ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారుల కోచ్ ఎం.డి. ఖమ్రుద్దీన్, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

