యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; యువతలో క్రీడా స్ఫూర్తిని మరింత పెంపొందించాలని మల్లేపల్లి సర్పంచ్ సత్యారం కథలప్ప అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి లో మేరా యువభారత్ ఆధ్వర్యంలో క్రీడా సామాగ్రి పంపిణీచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కథలప్ప, మేరా యువభారత్ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ అనిల్ గౌడ్ మాట్లాడుతూ.. మేరా యువభారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్ విజయవంతంగా చేపట్టామని అన్నారు.
వివేకానంద యువజన సంఘం సభ్యులకు క్రీడాసామాగ్రి పంపిణీ చేశామని గ్రామాల్లో ఉన్న యువజన సంఘాలను మేరా యువభారత్తో అనుసంధానం చేయడం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ అనుసంధానం ద్వారా యువజన సంఘాలకు అనేక అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తాయని అన్నారు. యువజన సంఘం సభ్యులకు వాలీబాల్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, ఫ్రిస్బీ, స్కిప్పింగ్ వంటి క్రీడా సామగ్రిని అందజేసినట్లు పేర్కొన్నారు.
మేరా యువభారత్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం గ్రామ యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువజన సంఘాలను బలోపేతం చేసి, వారిని సామాజిక సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తాయని ఆయన ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో యువకులు అరవింద్, బాలస్వామి, నాగేష్, శేఖర్, భాను ప్రసాద్, పి.ఎన్ లక్ష్మణ్, శీను, శివ, కురుమూర్తి, కేబి రఘు, జి అనిల్, పి.ఎన్ నరసింహ, పి.ఎన్ చిన్న ఎల్ శేఖర్, ఎల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
