జీవ‌న‌శైలిలో క్రీడ‌లు ఒక భాగం..

జీవ‌న‌శైలిలో క్రీడ‌లు ఒక భాగం..

ఖానాపూర్, ఆంధ్రప్రభ : వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు స్థానిక ఎస్ (ACE) ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో రమాకాంత్, ఖానాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ రాహుల్ గైక్వాడ్, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ రవీందర్ గౌడ్ ప్రారంభించారు. ఈ పోటీలలో యూత్ విభాగం, జూనియర్ విభాగం, సీనియర్ విభాగం లలో నిర్మల్ జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుంచి 40 క్రీడాకారులు పాల్గొనడం జరిగింది.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీడీవో ఖానాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ లు మాట్లాడుతూ.. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మానసిక ఆరోగ్యాన్ని పొందుతారని ప్రతి విద్యార్థి తన జీవనశైలిలో క్రీడలను ఒక భాగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏస్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్బు బాయ్, కరస్పాండెంట్ షేక్ అజార్ వెయిట్ లిఫ్టింగ్ అధ్యక్షులు షోయబ్ హుస్సేన్, కార్యదర్శి షేక్ ఇమ్రాన్, ఆర్చరీ కోచ్ అంబేద్కర్, ప్రిన్సిపల్ శ్రీకాంత్ కిషోర్ వివిధ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

1) కే అభిషేక్, 2)P సిద్ధార్థ మున్యాల పాఠశాల,
3)పి రిషిత్, 4)A విష్ణుTMRIES jr కళాశాల ఖానాపూర్,
5)k నవీన్ మస్కాపూర్ పాఠశాల,
6) అయాన్, స్నేహిత్ ఇస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఖానాపూర్..
7) శ్రీనిధి మస్కాపూర్
8) T సంహిత జామ్ బాలికల కళాశాల..
10) వర్షిని సారంగాపూర్..
11) విజ్ఞత మస్కాపూర్
పై క్రీడాకారులు నవంబర్ 7న వరంగల్ లో జరిగే రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొంటారని తెలిపారు.

Leave a Reply