Sports and Library | తొలి గ్రామసభ…
- స్పోర్ట్స్ అండ్ లైబ్రరీకి రూ.80వేల విరాళం
Sports and Library | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నడింపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గోపి పద్మ అజయ్ అధ్యక్షతన తొలి గ్రామసభను ఇవాళ నిర్వహించారు. ఈ సమావేశానికి వార్డు మెంబర్లు, గ్రామ యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామసభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎనిమిదవ వార్డు మెంబర్ గడ్డం గణేష్ గ్రామంలో స్పోర్ట్స్ అండ్ లైబ్రరీ(Sports and Library) అభివృద్ధి కోసం 80వేల రూపాయల చెక్కును సర్పంచ్ గోపి పద్మ అజయ్‌కు అందజేశారు.
గ్రామాభివృద్ధి(Rural Development)కి చేసిన ఈ సహకారానికి అందరూ గడ్డం గణేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం గణేష్ మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, గ్రామంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుండి పనిచేస్తానని తెలిపారు. ప్రజల సహకారంతో నడింపల్లిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా నాయకులు ఎస్.మల్లేష్, సి.మల్లయ్యతో పాటు వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

