SPORTS | క్రికెటర్లకు జ్ఞాపికలు
అందించిన ఏసీఏ ప్రెసిండెంట్ కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు
SPORTS | ఆంధ్రప్రభ, విశాఖపట్నం : ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో తలపడేందుకు విచ్చేసిన ఇండియా క్రికెట్ టీంకు ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీనియర్ ప్లేయర్స్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, కోచ్ గౌతమ్ గంభీర్ లకు ఏసీఏ తరఫున జ్ఞాపికలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సీవోవో గిరీష్ డోంగ్రీ, ఏసీఏ స్టేడియం చైర్మన్ ప్రశాంత్, ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ బండారు నర్సింహారావు, కోశాధికారి దండమూడి శ్రీనివాసరావు, ఏసీఏ కౌన్సిలర్ విష్ణు దంతు, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) ప్రతినిధి చాముండేశ్వరినాథ్ లతోపాటు ఏసీఏ సిబ్బంది పాల్గొన్నారు.


