విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్

మంథని, ఆంధ్ర్ర‌ప‌భ : విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం మంథని మండలం మల్లేపల్లి గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా. జై కిషన్ ఓజా గారు అధ్యక్షత ఘనంగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డే వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. జై కిషన్ ఓజా అధ్యక్షత వహించి ప్రారంభిస్తూ విద్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసిస్తూ తాము, తమ సమాజానికి ఉన్నత విలువలు అందజేయాలని తమ జూనియర్స్ కు ఆదర్శప్రాయంగా నిలవాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంథని మున్సిపల్ చైర్ పర్సన్ ఒడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని, కళాశాల అభివృద్ధికై తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందజేస్తామని తెలియజేశారు. తదనంతరం క్రీడలలో రాణించిన విజేతలకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. తర్వాత జరిగిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, మల్లేపల్లి సర్పంచ్ లక్కాకుల సత్యనారాయణ, కళాశాల సీపీడీసీ సెక్రటరీ మాదాడి ప్రభాకర్ రెడ్డి, పూర్వ విద్యార్థుల మండలి అధ్యక్షుడు కొండేల మారుతి, వైస్ ప్రిన్సిపల్ పరిషయ్య, ఐక్యుఏసి కోఆర్డినేటర్ కృష్ణ , ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డా. లక్ష్మీనారాయణ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇన్చార్జి సతీష్ అధ్యాపకులు అమర్నాథ్, ముకుందం, ఫర్జానా, మానస, రజిత, దుర్గం కృష్ణ, శేఖర్, శ్రీధర్ బోధనేతర సిబ్బంది సుధాకర్, ముజాహిద్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply