Spirit Movie | ఈసారి ప్రభాస్, సల్మాన్ మధ్య పోటీ తప్పదా..?

Spirit Movie | ఈసారి ప్రభాస్, సల్మాన్ మధ్య పోటీ తప్పదా..?
Spirit Movie | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంక్రాంతికి ది రాజాసాబ్ అంటూ ప్రేక్షకుల ముందుకు రావడం తెలిసిందే. మారుతి తెరకెక్కించిన ఈ హర్రర్ మూవీ (Horror Movie) అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలు అన్నీ స్పిరిట్ పైనే పెట్టుకున్నారు. అయితే.. సందీప్ రెడ్డి వంగా పక్కా ప్లానింగ్ తో స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ప్రభాస్ వెర్సెస్ సల్మాన్ అని వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. మరి.. నిజంగానే ప్రభాస్, సల్మాన్ పోటీపడనున్నారా..?

Spirit Movie | మార్చి 5న స్పిరిట్..
పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. వీరిద్దరి కాంబోలో స్పిరిట్ మూవీ అని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఎప్పుడో ఈ సినిమా స్టార్ట్ కావాలి కానీ.. ప్రభాస్ బిజీగా ఉండడం వలన లేట్ అయ్యింది. ఇటీవల స్పిరిట్ సెట్స్ పైకి వచ్చింది. షూటింగ్ స్టార్ట్ కాకముందే దాదాపు డబ్బై శాతం రీ రికార్డింగ్ కంప్లీట్ చేయడం విశేషం. షూటింగ్ స్టార్ట్ చేస్తే.. వీలైనంత స్పీడుగా షూటింగ్ కంప్లీట్ చేసేలా సందీప్ ప్లాన్ రెడీ చేశారు. ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. 2027లో మార్చి 5న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

Spirit Movie | రంజాన్ కి సల్మాన్ మూవీ..
స్పిరిట్ రిలీజ్ డేట్ (Release Date) బయటకు వచ్చినప్పటి నుంచి సల్మాన్, వెర్సెస్ ప్రభాస్ అని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. మేటర్ ఏంటంటే.. కండలవీరుడు సల్మాన్ ఖాన్.. రాజ్ – డీకే తో సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించి కథాచర్చలు జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని 2027 రంజాన్ టైమ్ కి విడుదల చేయాలనేది ప్లాన్ అని తెలుస్తోంది. సల్మాన్ కు రంజాన్ అనేది సెంటిమెంట్. అందుకనే రంజాన్ కు కొత్త సినిమాను రిలీజ్ చేస్తుంటాడు. సందీప్ స్పిరిట్ మూవీకి రంజాన్ తో పాటు వీకెండ్ కలిసొచ్చేలా డేట్ లాక్ చేశాడు. ప్రచారంలో ఉన్నది నిజమైతే.. రంజాన్ కు ప్రభాస్, సల్మాన్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడితే.. రసవత్తరంగా ఉంటుంది. ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి.


