CM | పనులు వేగవంతం చేయండి

CM | పనులు వేగవంతం చేయండి

CM | చేవెళ్ల, ఆంధ్రప్రభ : హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి (ఎన్ హెచ్163) విస్తరణ పనులు మరింత వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనమండలి (Legislative Council) ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పరిగి, తాండూర్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో మర్రిచెట్లను పరిరక్షించాలని కేసులు వేసిన వారితో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. నేపథ్యంలో కేసు విత్ డ్రా చేసుకున్నందుకు పర్యావరణ ప్రేమికులకు ధన్యవాదాలు తెలిపి, సన్మానించారు. ఈ సందర్భంగా 954 చెట్లను ఎట్టి పరిస్థితుల్లో పరిరక్షించాలని సీఎం ఆదేశించారు. రోడ్డు యుద్ధ ప్రాతిపదికపై నాణ్యతతో, సకాలంలో పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తదితరులున్నారు.

Leave a Reply