రాజన్నకు ప్రత్యేక పూజలు
వేములవాడ, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి(Sri Parvati Rajarajeswara Swami) దేవస్థానాన్ని సంగారెడ్డి జిల్లా బర్దిపూర్‌కు చెందిన శ్రీ శ్రీ శ్రీ దత్తగిరి మహారాజ్(Sri Sri Sri Dattagiri Maharaj) ఈ రోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వర స్వామి (రాజన్న)కు ప్రత్యేక పూజలు చేశారు.
స్వామీజీ ఆలయ ప్రాంగణంలోకి చేరుకోగానే ఆలయ అర్చకులు, అధికారులు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వస్తి వచనాలతో ఘన స్వాగతం పలికారు. శ్రీ స్వామి వారి దర్శనం అనంతరం కల్యాణ మండపంలో స్వామీజీకి రాజన్న శేష వస్త్రం(Sesha Vastra), లడ్డూ ప్రసాదాన్ని ఆలయ అధికారులు మహారాజ్ కు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ సహాయ కార్యనిర్వహణాధికారి జి.అశోక్ కుమార్(G. Ashok Kumar), ఆలయ పర్యవేక్షకులు రాజేందర్ , ఆలయ అర్చకులు వేద పండితులు ఉన్నారు.


