ఆలయంలో ప్రత్యేక పూజలు…

ఆలయంలో ప్రత్యేక పూజలు…
ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఎండపల్లి మండలం చెర్లపల్లి గ్రామంలోని శివపంచాయతన ఆంజనేయ స్వామి(Anjaneya Swami) ఆలయ పునర్నిర్మాణ ఉత్సవాలలో భాగంగా ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు వెల్గటూర్ మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాస్ రావు(Ponugoti Srinivas Rao), మంజుల దంపతులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ పునర్నిర్మాణానికి శ్రీనివాస రావు ఇప్పటికే రూ.2.20 లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ చుక్క శంకర్ రావు(Chukka Shankar Rao), సర్పంచ్ మొగిలి ఆధ్వర్యంలో గ్రామస్థులు పోనుగోటి దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఎస్ ఆర్ అభిమానులు పాల్గొన్నారు.
