ప్రత్యేక రక్షణ చట్టం తేవాలి…

ప్రత్యేక రక్షణ చట్టం తేవాలి…

చిట్యాల, ఆంధ్రప్రభ : రజక వృత్తిదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని రజక వృత్తిదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పైల్ల ఆశయ(Pailla Asaya) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఈ రోజు చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్వహించిన రజక వృత్తిదారుల సంక్షేమ సంఘం(Welfare Association) మండల మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు.

సమాజంలో రజక వృత్తిదారుల పై నిత్యం జరుగుతున్న సామాజిక దాడులను నివారించడంలో పాలక ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని, అందువల్లే నిత్యం రజక నాయి బ్రాహ్మణ వంటి వృత్తిదారులపై సామాజిక దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అమనగంటి స్వామి, రుద్రారం పెద్దులు, అమనగట్టి నరేష్, అక్కెనపల్లి నాగయ్య(Akkenapalli Nagayya), ఐతరాజు నరసింహ, అర్జున్, గోలి మహేష్, మాజీ ఎంపీటీసీ ఎద్దులపురి కృష్ణ, దామనూరి కనకయ్య, ఐతరాజు మాధవి, సైదులు, అమరోజు రాములు, బాతరాజు జంగయ్య తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply