సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా గట్టుప్పల మండలంలోని అంతంపేట గ్రామ పరిధిలోని సోమరాజుగూడ సోమేశ్వరాలయంలో 2వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు గట్టుప్పల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నామని జగన్నాథం,గ్రామ సర్పంచ్ చందా శ్రీలత వెంకటేశం,ఎస్ఐ సంజీవరెడ్డి,తేరటుపల్లి మాజీ సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం సోమేశ్వరాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో,పాడిపంటలతో అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మాధగోని వెంకటయ్య,పూసపాటి శంకరప్ప, గూడపు జలంధర్,దేవాలయ కార్యవర్గ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply