ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు..
కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా(India vs South Africa) ఉమెన్స్ టీం వరల్డ్ కప్ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్ ఫైనల్లో.. భారత్ విజయం సాధించాలని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్(Paper Krishna Prasad) ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంటుమిల్లి మండలం అత్తమూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేలా ఈ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
భారతదేశ యావత్తు ప్రజలు ఈ విజయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. మహిళా క్రికెటర్లు(Women Cricketers) తమ సత్తాను చాటి దేశాన్ని గర్వించదగ్గ స్థాయిలో నిలిపేందుకు కృషి చేయాలని ఆయన దేవుణ్ణి కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ బొర్రా కాశీ, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

