ప్రత్యేక లోక్ అదాలత్ సక్సెస్..

- 5025 కేసులు పరిస్కారం
- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌కు ప్రజలు విశేషంగా స్పందించారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 5,025 కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు.
కమిషనర్ వివరాల ప్రకారం.. ఎఫ్‌ఐఆర్ కేసులు: 1,011, పెట్టికేసులు: 1,281, డ్రంకన్ డ్రైవింగ్ & మోటార్ వెహికల్ చట్టం కేసులు: 2,533, సైబర్ క్రైమ్ కేసులు: 200 పరిష్కరించామన్నారు. ఈ కేసుల పరిష్కరించడం ద్వారా బాధితుల వివిధ బ్యాంకు ఖాతాల్లో నిలిపివేసిన రూ.89,43,506లను విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఆయన అన్నారు.
లోక్ అదాలత్ రాజీ మార్గానికి అత్యుత్తమ వేదికగా నిలుస్తోందని, ఇరు వర్గాలకు న్యాయం జరిగేలా ఈ కార్యక్రమం సహకరిస్తుందని కమిషనర్ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన పోలీస్ అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, న్యాయసేవాధికారులు, కక్షిదారులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
