బాపట్ల నుండి మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రత్యేక బస్సు

బాపట్ల నుండి మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రత్యేక బస్సు

బాపట్ల నుండి మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రత్యేక బస్సు సర్వీస్ ప్రారంభం
జిల్లా కలెక్టర్ పి. వినోద్ కుమార్ ఆదేశం

బాపట్ల టౌన్,ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రం బాపట్ల నుండి మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లే రోగులు, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసును నడపాలని జిల్లా కలెక్టర్ పి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవంలో భాగంగా పట్టణ ప్రముఖులు విజ్ఞప్తి చేయగా, కలెక్టర్ తక్షణమే స్పందించారు.

ప్రస్తుతం బాపట్ల నుండి గుంటూరు వరకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లే వారు గుంటూరులో దిగి మరో వాహనం మారాల్సి వస్తోందని ప్రజలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రజల విన్నపంపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, ప్రతిరోజూ ఉదయం బాపట్ల నుండి గుంటూరు మీదుగా నేరుగా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి, తిరిగి వచ్చేలా బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజా రవాణా అధికారి విమలను ఆదేశించారు.

సామాన్యుల ఇబ్బందులను గుర్తించి, రవాణా సౌకర్యం కల్పించేలా చొరవ చూపిన కలెక్టర్ వినోద్ కుమార్ కు పట్టణ ప్రజలు, మేధావులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సర్వీస్ అందుబాటులోకి రావడం వల్ల బాపట్ల జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు పొందడం సులభతరం కానుంది.

Leave a Reply