పీఎస్‌లో కుటుంబ సభ్యుల ఫిర్యాదు
ఏలూరు జిల్లా, ఆంధ్రప్రభ : పోలీస్ శాఖ(Police Department)లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్(Special Branch Head Constable)గా పనిచేస్తున్న సుబ్బారావు అదృశ్యమయ్యారు. ఏలూరు జిల్లా (Eluru District) జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధి కామవరపుకోట, టీ నర్సాపురం మండలాల్లో విధులు నిర్వహిస్తున్న ఆయన నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదంటూ పీఎస్‌లో కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. చివరిసారిగా అటవీ ప్రాంతం(Forest Area)లో ఫోన్ సిగ్నల్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. డ్రోన్ (Drone) సహాయంతో తాడ్వాయి ఏజెన్సీ ప్రాంతంలో సుబ్బారావు ఆచూకీ కోసం పోలీసులు (Police) గాలిస్తున్నారు.

