డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్థలాన్ని పేదలకు పంచాలి

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్థలాన్ని పేదలకు పంచాలి

  • సిపిఐ పార్టీ నాయకులు

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : కంకణాల గూడెం రెవెన్యూ పరిధిలో అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ల స్థానంలో ఇంటి స్థలాలు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనీ సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నారాయణపురం మండలంలోని కంకణాలగూడెం రెవిన్యూ పరిధిలో 164 సర్వే నెంబర్ లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాల స్థానంలో ఇండ్ల స్థలాలు లేని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం స్థలం పంపిణీ చేయాలని సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని పరిశీలించి తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. సిపిఐ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, చిలువేరు అంజయ్య, పల్లె మల్లారెడ్డి, ఈద మల్లయ్య, పందుల యాదగిరి, రుద్ర రాములు, చిలువేరి అంజయ్య, సురపల్లి జనార్ధన్,యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply