మక్తల్ , ఆంధ్రప్రభ : నిమజ్జనం సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని మహబూబ్‌నగర్ ఎస్‌పీ యోగేష్ గౌతమ్ అన్నారు. ఈ రోజు మక్తల్ వచ్చిన ఆయన నిమజ్జనం రూట్ పరిశీలించారు.
తొలుత ఆజాద్ నగర్, యాదవ్ నగర్, గాంధీనగర్ ఏరియాలో ఏర్పాటు చేసిన గణపతులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గణేష్ మండప నిర్వాహకులకు భద్రతపరమైన సూచనలు చేశారు. డీజే లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రార్థన మందిరాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ… గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండగ రెండు ఒకేసారి రావడం వల్ల అన్నివర్గాల ప్రజలు ప్రశాంతంగా పండుగలు నిర్వహించుకోవాలని కోరారు.
ఎలాంటి సమస్య ఉన్న తక్షణమే సంబంధిత లోకల్ పోలీసులకు లేదా డయల్100 కి సమాచారం ఇవ్వాలని కోరారు. ఎస్పీతో పాటు సీఐ రామ్ లాల్, ఎస్ఐ వై.భాగ్యలక్ష్మి రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
