SP | ఎన్నికల ప్రక్రియపై ఆరా
- పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి
SP | దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : దస్తూరాబాద్ మండలంలోని పోలింగ్ కేంద్రాలను నిర్మల్ జిల్లా అడిషన్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉంచాలని సీఐ అజయ్, ఎస్ ఐ సాయికుమార్ కి సూచించారు. కౌంటింగ్ జరిగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.

