Sp | ఆలయాల పేరిట వచ్చే నకిలీ వెబ్ సైట్ లు, యాప్ లు నమ్మవద్దు..

Sp | ఆలయాల పేరిట వచ్చే నకిలీ వెబ్ సైట్ లు, యాప్ లు నమ్మవద్దు..
భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
Sp | కర్నూల్ , ఆంధ్ర ప్రభః మహ శివరాత్రి సంధర్బంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సైబర్ నేరగాళ్లు ఆలయాల పేరిట నకిలీ వెబ్‌సైట్లు, యాప్ లు సృష్టించి మోసాలకు పాల్పడతారని భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. వివిధ శైవ క్షేత్రాలకు భారీగా భక్తులు తరలివెళ్లే అవకాశం ఉన్నందున, ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కొందరు సైబర్ నేరగాళ్లు సత్రాలు లేదా వసతి గదుల బుకింగ్ , ఆన్‌లైన్ దర్శన టికెట్లు,ప్రత్యేక పూజల పేర్లతో నకిలీ వెబ్‌సైట్లు, లింకులు సృష్టించి మోసాలకు పాల్పడుతుంటున్నారన్నారు.
భక్తులు, ప్రజలు ఈ సంధర్భంగా కింది సూచనలను తప్పనిసరిగా పాటించాలని కర్నూలు ఎస్పీ తెలిపారు. దర్శన టికెట్లు , సత్రాలు లేదా గదులు, ప్రత్యేక పూజల బుకింగ్ కోసం కేవలం అధికారిక ఆలయ వెబ్‌సైట్లు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన యాప్‌లను మాత్రమే ఉపయోగించాలి. సోషల్ మీడియా, వాట్సాప్, ఎస్‌ఎంఎస్ ద్వారా వచ్చే అనుమానాస్పద లేదా తెలియని లింకులపై క్లిక్ చేయకూడదు. తక్కువ ధరలతో సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ టెలిగ్రాo లలో వచ్చే ప్రకటనలను నమ్మకూడదు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు నంబర్, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వ్యక్తులతో పంచుకోకూడదు.
ఆన్‌లైన్ చెల్లింపులు కన్ఫర్మేషన్ మెసేజ్‌ను పరిశీలించాలి.
బ్యాంక్ అధికారులు, దేవాలయ సిబ్బంది ఎప్పుడూ OTPలు లేదా పిన్ నంబర్లు అడగరు ఏదైనా సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. భక్తులందరూ అప్రమత్తంగా ఉండి, సురక్షితంగా మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
