99. సరస్వత్యాలక్ష్మ్యావిధిహరిసపత్నోవిహరతే
రతేః పాతివ్రత్య శిధిలయతిరమ్యేణవపుషా
చిరంజీవన్నేవక్షపితపశుపాశవ్యతికరః
పరానందాభిఖ్యంరసయతి రసం త్వద్భజనవాన్.
తాత్పర్యం: తల్లీ! లోకమాతా! నిన్ను సేవించే భక్తుడు సరస్వతీ కటాక్షం వలన బ్రహ్మగారికి, లక్ష్మీకటాక్షం వల్ల విష్ణువుకి ప్రత్యర్థిగా మారి విహరిస్తాడు. అత్యంత సుందరమైన రూపంతో మన్మథపత్ని అయిన రతీదేవి పాతివ్రత్యాన్ని కూడ సడలింప చేస్తాడు. చిరంజీవత్వాన్నిపొందుతాడు. చివరకు జీవసంబంధ, అవిద్యాసంబంధాల నుండి తొలగి, జీవన్ముక్త స్థితిలో పరానంద సుఖాన్ని అంటే మోక్షానందాన్నిపొందుతాడు.
- డాక్టర్ అనంత లక్షీ