96. కళత్ర్రంవైధాత్రంకతికతిభజంతే న కవయః
శ్రియోదేవ్యాః కోవా న భవతిపతిః కై రపిధనైః
మహాదేవంహిత్వాతవసతిసతీనామచరమే
కుచభ్యామాసంగఃకురవకతరోరప్యసులభః.
తాత్పర్యం: పతివ్రతాశిరోమణి అయిన పార్వతీదేవీ! బ్రహ్మగారి భార్య అయిన సరస్వతిని ఎంతోమంది సేవించుకుని పొందారు. కొందరు లక్ష్మీదేవిని సేవించి కొంతధనాన్ని పొంది లక్ష్మీపతి అనిపించుకుంటున్నారు. కాని, పతివ్రతలలో మొట్టమొదట గణించ దగినజగదంబా! నీ స్తనయుగంతో కూడిన కౌగిలింత ఆ సదాశివుడు ఒక్కడికే తప్ప గోరింట చెట్టుకి కూడా లభించదు కదా!
- డాక్టర్ అనంత లక్ష్మీ