సౌందర్య లహరి

85. నమోవాకంబ్రూమో నయన రమణీయాయపదయోః
తవాస్మైద్వంద్వాయస్ఫుటరుచిరసాలక్తకవతే
అసూయత్యంత్యం తం యదభిహననాయస్పృహయతే
పశునామీశానఃప్రమదవనకంకేళితరవే.

తాత్పర్యం: లత్తుకరసంతో తడిసి అరుణవర్ణంతో ఇంపైన స్పష్టమైన ప్రకాశంతో నయనానందకరంగా ఉన్నది నీ పాదయుగళం. ఆ పాదతాడనాన్ని ఎప్పుడు పొందుతూ ఉండే ఉద్యానవనంలోని అశోకవృక్షాలని చూసి, అసూయ చెందిన శివుడు నీ పాదతాడనం కోసం తహతహ లాడుతున్నాడు. అటువంటి నీ పాదద్వంద్వానికి నమస్కారాలు చెపుతున్నాను.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply