84. .శ్రుతీనాంముర్ధానోదధతి తవ యౌ శేఖరతయా
మమాప్యేతౌ మాత శ్శిరసిదయయాధేహిచరణౌ
యయోఃపాద్యంపాథః పశుపతి జటాజూటతటినీ
యయోర్లాక్షాలక్ష్మీరరుణహరిచూడామణిరుచిః.
తాత్పర్యం: జగజ్జననీ! ఉపనిషత్తులు శిరస్సున ధరించే సిగపూలు, శివుడి జటాజుటం నుండి స్రవించే గంగని పాద్యంగా పొందినవి, విష్ణుమూర్తి చూడామణి యొక్క ఎర్రని కాంతియేలత్తుకరసంగా కలిగినవి (విష్ణుమూర్తి చూడామణి ఎర్రదనానికి కారణం అయిన లత్తుకరస కాంతి కలిగినవి) అయిన నీ పాదాల జంటని దయతో నా శిరస్సున ఉంచవలసినది.
- డాక్టర్ అనంతలక్ష్మి