81. గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజాత్
నితంబాదాచ్ఛిద్యత్వయి హరణ రూపేణ నిదధౌ
అతస్తేవిస్తేర్ణోగురురయమశేషాంవసుమతీం
నితంబప్రాగ్భారస్స్థగయతిలఘుత్వంనయతి చ.
తాత్పర్యం: ఓ పర్వతరాజపుత్రీ! పర్వతరాజైన హిమవంతుడు నీకు స్త్రీధనంగా తన కొండ మధ్యభాగంలో ఉన్న చదునైన ప్రదేశం నుండి బరువుని, వైశాల్యాన్ని వేరు చేసి ఇచ్చాడు. అందువల్లనే నీ పిరుదుల ఘనత బరువుగాను, విశాలంగాను, విరివిగాను ఉండి, సమస్త భూభాగాన్ని కప్పివేసి, దానిని తక్కువ చేస్తూ ఉంది.
విశేషం: ఈ శ్లోకం అమ్మవారి పిరుదుల ఘనతని తెలుపుతుంది. స్త్రీల ఉత్తమ సాముద్రిక, సౌభాగ్య లక్షణాలలో ఒకటి బరువైన, విశాలమైన, నున్నని, ఎత్తైన, అర్థగోళాకారంలో ఉన్న పిరుదులు కలిగి ఉండటం. వీటిలో కొన్ని ఉంటాయి సాధారణంగా చాలమంది స్త్రీలకి. అమ్మవారి పిరుదులకి అన్ని లక్షణాలు సమగ్రంగా ఉండటానికి గల కారణాన్ని తెలియ చేస్తున్నారు ఈ శ్లోకంలో.
- డాక్టర్ అనంతలక్ష్మి