58. అరాళం తే పాళీయుగళమగరాజన్యతనయే
న కేషా మాధత్తేకుసుమశర కోదండ కుతుకం
తిరశ్చీనోయత్ర శ్రవణ పథ ముల్లంఘ్యవిలసన్
అపాంగవ్యాసంగోదిశతిశరసంధానధిషణామ్.
తాత్పర్యం: పర్వతరాజపుత్రీ! అందమైన వంపులతో సొంపుగా ఉన్న నీ కణతల జంట భాగాన్ని చూడగానే ఎవరికైనా పూలబాణాలని ఎక్కుపెట్టిన మన్మథుడివింటి సొగసు అయి ఉంటుందన్న భావన కలుగక మానదు. దానికి కారణం – వంగిన విల్లు వంటి వంపు సొంపులున్న కణతల ద్వారా నీ కృపాకటాక్షవీక్షణవిలాసప్రకాశం అనే బాణం నీ చెవులని చేరుకోవటమే కాదు, వాటిని దాటి కూడా ప్రసరిస్తూ ఉండటమే.
- డాక్టర్ అనంతలక్ష్మి