57. దృశాద్రాఘీయస్యాదరదళితనీలోత్పలరుచా
దవీయాంసం దీనం స్నపయకృపయా మా మపి శివే
అనే నాయంధన్యోభవతినచతే హాని రియతా
వనేవాహర్మ్యేవాసమకరనిపాతోహిమకరః.
తాత్పర్యం: శివా,శుభప్రదురాలవైన పార్వతీదేవీ, బాగా పొడవుగా సాగినట్టు విశాలంగా కొంచెం వికసించిన నల్లకలువల కాంతి వంటి కాంతి కలిగిన నీ కడకంటి చూపు అనే వర్షంలో దయతో –చాలా దూరంలో, దీనావస్థలో ఉన్న నన్ను సైతం తడుపవలసినది. ఈ మాత్రముతో ఈ దీనుడు ధన్యుడౌతాడు. నీకు ఎటువంటి హాని ఉండదు. (ఏ విధంగా అంటే) చంద్రుడు అరణ్యంలోనూ, సౌధముల మీద కూడా తన కిరణాలని ప్రసరింప చేస్తున్నాడు కదా. కిరణాలని ప్రసరింప చేస్తున్నాడు కదా.
- డాక్టర్ అనంతలక్ష్మి