సౌందర్య లహరి

50. కవీనాం సందర్భ స్తబక మకరందైక రసికం
కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణ యుగళం
అముంచన్తౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళా
వసూయా సంసర్గా దళికనయనం కించి దరుణం.

తాత్పర్యం: అమ్మా !జగజ్జననీ! మంచి కవుల రసవత్తర రచనలు అనే పూల గుత్తుల నుండి జాలువారే పూదేనెయందు మాత్రమే నీ చెవులు ఆసక్తి కలిగి ఉంటాయి. ఆ కారణంగా, నవరసాస్వాదనానుభూతిని పొందటంలో మిక్కిలి ఆసక్తి కలిగి ఉన్న నీ రెండు కన్నులు అనే గండు తుమ్మెదలుకడగంటి చూపులు అనే నెపం (వంక)తో ఆ రసాస్వాదనను వదల లేక నీ వీనుల జంటను అంటి పెట్టుకునే ఉన్నాయి. దీనిని చూసిన నీ లలాట నేత్రం అసూయని పొందటం వల్ల కొంచెం ఎర్ర బడింది.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *