సౌందర్య లహరి

41. తవాధారేమూలే సహ సమయయాలాస్యపరయా
నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటం
ఉభాభ్యామేతాభ్యాముదయవిధిముద్దిశ్యదయయా
సనాథాభ్యాంజజ్ఞే జనక జననీమజ్జగదిదం.

తాత్పర్యం : జగజ్జననీ! నీ మూలాధారచక్రంలో లాస్యము నందు ఆసక్తురాలైన‘ సమయ’ అనే పేరున్న శక్తి (మహాభైరవి)తో కూడి నవరసాలతో ( శృంగారం మొదలైన) ఒప్పే ‘ తాండవ’ నృత్యాన్ని అభినయించే వాడిని నవాత్ముడైనఆనందభైరవుడిగా భావిస్తున్నాను. ఈ ఇద్దరి కలయికప్రళయాగ్నిలో దగ్ధమైన లోకాలని మళ్ళీ ఉత్పత్తి చేయటం వల్ల ఈ జగత్తు తల్లితండ్రులు కలది అవుతోంది అని తెలుసుకుంటున్నాను.

డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *