సౌందర్య లహరి

15. శరజ్జ్యోత్స్నాశుభ్రాంశశియుతజటాజూటమకుటాం
వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికాపుస్తకకరాం
సకృన్నత్వానత్వా కథ మివసతాంసన్నిదధతే
మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురీణాఃఫణితయః.

తాత్పర్యం: జగజ్జననీ! శరత్కాలపువెన్నెల వలె శుద్ధమైన కాంతులను వెదజల్లుచు,జుట్టుముడి అనే కిరీటంలో నెలపొడుపు చంద్రరేఖని ధరించి, వరద, అభయ, స్ఫటిక అక్షమాల, పుస్తకములను నాలుగు చేతులందుధరించినట్టుగా ఉన్న నీ రూపాన్ని ధ్యానించి ఒక్కమారు నమస్కరించిన సజ్జనులకు తేనె, పాలు,ద్రాక్షాఫల రసముల తీయదనం కల వాగ్వైభవం లభించకుండా ఎట్లా ఉంటుంది? అంటే పైన వర్ణించిన రూపంతో ఉన్న అమ్మని ధ్యానం చేసి నమస్కరిస్తే తీయనైన వాగ్విలాస వైఖరులు సిద్ధిస్తాయి.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *