Social media | అందుబాటులో ఉండి అభివృద్ధికి పాటుపడుతాం

Social media | అందుబాటులో ఉండి అభివృద్ధికి పాటుపడుతాం

Social media | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సర్పంచ్ గానూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించి అనిత శ్రీనివాస్ జాదవ్ దంపతులకు ఈరోజు వారి స్వగృహంలో సోషల్ మీడియా(Social media) జిల్లా నాయకులు బాబా శ్యామ్ టైగర్, బీఆర్ ఎస్ వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ లు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అనిత శ్రీనివాస్ మాట్లాడుతూ… అభివృద్యే మా లక్ష్యం ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధి(development) కోసం మీ సేవకులుగా పని చేస్తామని పారదర్శక పాలన సమాన అభివృద్ధిగా పని చేస్తామని అన్నారు.ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తామని ప్రతి కుటుంబానికి మేలు చేసేలా గ్రామంలోనే ఉంటూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామన్నారు గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉండి కష్టపడి పని చేస్తామని తెలిపారు. మీ సహాయ సహకారాలు అందించాలని సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్ కోరారు.

Leave a Reply