బీఆర్ నాయుడుపై వైసిపి నాయకుల ఆరోపణలు బూటకం

బీఆర్ నాయుడుపై వైసిపి నాయకుల ఆరోపణలు బూటకం
పిళ్ళ శ్రీనివాసరావు
భవానిపురం, ఆంధ్రప్రభ : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుపై ఊసరవల్లి పార్టీ వైసిపి నాయకులు చేస్తున్న ఆరోపణలు బూటకమని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పిళ్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయం నుండి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాఫింగ్ చేసిన అసభ్యకర వీడియోలు, తయారు చేసిన వీడియోలను సోషల్ మీడియాలో దురుద్దేశపరంగా పెట్టి కథనాలు సృష్టిస్తూ ధర్నాలు చేయడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు.
గత ఐదు సంవత్సరాలు వైసిపి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు జరుగుతున్ననష్టాలను, మీ అరాచక, నియంత పరిపాలన విధానాన్ని టీవీ 5 ప్రజలకు తెలియపరచడంలో సఫలీకృతమైనందుకుగాను కక్ష సాధింపు చర్యగా, దురుద్దేశపూర్వకంగా బిఆర్ నాయుడుపై చేస్తున్న విష ప్రచారాన్ని, మీ నాయకులు చేస్తున్న ధర్నాలను రాష్ట్ర ప్రజలు గ్రహించి చికొడుతున్నారని అన్నారు. ఇకనైనా జ్ఞానంతో బుద్ధిగా వ్యవహరించాలని హితవు పలికారు.
