Social | శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు….

Social | శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు….

Social | ధర్మపురి, ఆంధ్రప్రభ : ధర్మపురి మండల ప్రజలు సోషల్ మీడియా(Social media) వాట్సప్, తదితర మాధ్యమాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పోస్టులు పెడితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ధర్మపురి ఎస్ఐ గురక మహేష్ ప్రజల ను హెచ్చరించారు.

ఈ రోజు ఆయన మీడియా తో మాట్లాడుతూ .. ఎన్నికల సమయంలో వాట్స్అప్(WhatsApp)లో గాని, ఇతర సోషల్ మీడియాలో గాని ఎవరిని ఉద్దేశించి అనుచిత వ్యాక్యాలు చేయరాదని, రెచ్చగొట్టే మెసేజ్ లు పంపరాదని, అన్ని వాట్స్ అప్ గ్రూప్ లు, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలు పోలీస్(Police) వారి పర్యవేక్షణలో ఉంటాయన్నారు.

ఓటర్స్ అందరూ తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాల‌నీ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయని ప్రజలను హెచ్చరించారు.

Leave a Reply