Sobhita Dhulipala | సరికొత్త సస్పెన్స్ డ్రామా చీకటిలో..

Sobhita Dhulipala | సరికొత్త సస్పెన్స్ డ్రామా చీకటిలో..

Sobhita Dhulipala | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన క్రైమ్ సస్పెన్స్ సినిమా చీకటిలో. సంధ్య అనే ఒక ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సంధ్య (Sandya) పాత్రను శోభిత ధూళిపాల పోషించారు. ఆమె నగరంలో జరిగే కొన్ని దారుణమైన చీకటి రహస్యాలను వెలికితీస్తుంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ప్రై. లి. బ్యానర్ పై డి. సురేష్ బాబు నిర్మించారు. ఇంతకీ.. ఈ మూవీ ఎలా ఉండబోతుంది..? రిలీజ్ ఎప్పుడు..?

ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో శోభిత ధూళిపాలతో పాటు విశ్వదేవ్ రాచకొండ కనిపించనున్నారు. వెంట చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ (Vadlamaani Srinivas) ఇతరులు కీలక పాత్రలు పోషించారు. రెగ్యులర్ గా వచ్చే కథలకు పూర్తి భిన్నంగా రూపొందిన సినిమా ఇదని మేకర్స్ చెబుతన్నారు. సక్సెస్ పై గట్టి నమ్మకంగా ఉన్నారు. శోభిత పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా.. ఎంగేజింగ్ గా ఉంటుందని ఆమె కెరీర్ లో మరచిపోలేని సినిమాగా నిలుస్తుందని అంటున్నారు.

Sobhita Dhulipala

ఈ మూవీ నిర్మాత డి. సురేష్ బాబు (Sureshbabu) తన అభిప్రాయాలను పంచుకుంటూ… చీకటిలో ఒక భావోద్వేగాలు నిండిన సస్పెన్స్ డ్రామా. చీకటిని ఎదుర్కోవడానికి, నిజాలు మాట్లాడటానికి కావలసిన ధైర్యాన్ని ఇది అన్వేషిస్తుంది. ఈనాటి సమాజంలో ఇది మనకెంతో అవసరం. ఈ అమెజాన్ ఒరిజినల్ కోసం ప్రైమ్ వీడియోతో కలిసి పని చేయడం ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది. ఈ సినిమా మరొక మైలురాయి. ఉత్కంఠభరితమైన కథతో చీకటిలో ఒక మరపురాని ఉత్తేజకరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. భారతదేశముతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు జనవరి 23న ప్రైమ్ వీడియోలో చీకటిలో.. ప్రీమియర్ గా ప్రసారం అవుతుంది. ప్రేక్షకులు ఈ క్రైమ్ థ్రిల్లర్ ను చూసి ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాం అన్నారు.

Sobhita Dhulipala

CLICK HERE TO READ మారుతి మెప్పించాడా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply