Slogans | మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రైతు దినోత్సవం

Slogans | మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రైతు దినోత్సవం

Slogans | కుంటాల, ఆంధ్ర‌ప్ర‌భ : ఆరుగాలం కష్టపడి పండించిన జాతీయ రైతు దినోత్సవం ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన కుంటాలలోని స్థానిక మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రైతు దినోత్సవంను పురస్కరించుకొని స్థానిక సర్పంచ్ జక్కుల గజేందర్ మాట్లాడుతూ… దేశానికి(country) రైతు వెన్నుముక్క అని రైతులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న పంటలపై ఆధారపడి ఉంటారని తెలియజేశారు.

రాబోయే రోజుల్లో రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అన్ని విధాల ఆదుకోవాలని పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి శ్రమించి పంటలు పండిస్తారని రైతులకు(farmers) సైతం గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు రైతులపై చిన్నచూపు చూస్తాయ‌ని పేర్కొన్నారు. వ్యవసాయంతో ముడిపడి ఉన్న రైతాంగంపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారని పేర్కొన్నారు.

అనంతరం రైతు దినోత్సవం పురస్కరించుకొని రైతన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రైతన్న అంటూ నినాదాలు(Slogans) చేశారు. రైతులు పండించిన ధాన్యంతోనే ఎన్నో దేశాలకు దిగుమతులు చేస్తున్నారని పేర్కొన్నారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రైతులకు పూలమాలలతో సత్కరించి స్వీట్లు(sweets) పంచిపెట్టారు.

అదేవిధంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధికి సహాయ సహకారాలు అందించి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తోట రాఘవేందర్, ఓడ్నం గజ్జరం నాగరాజు, ధోనిగామ రాజు, శపతి వివేకానంద, రాకేష్, సబ్బిడి ముత్యం, రాకేష్, గజేందర్, మున్నూరు కాపు సంఘం నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply